ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గ్రామాల్లో కావాల్సింది గొడవలు కాదు.. ఐకమత్యం సీఎం చంద్రబాబు నాయుడు మొగల్తూరు

మొగల్తూరు,అర్జున్ సమాచారం:
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. గ్రామాల్లో కావాల్సింది గొడవలు కాదు.. ఐకమత్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
మంగళవారం అయన మొగల్తూరు లో పర్యటించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీల్లోనూ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ప్రత్యక్ష ఎన్నిక విధానానికి శ్రీకారం చుట్టామనపి అన్నారు. ఆరు నెలలకు ఒకసారి ఆయారాం..గాయారాంలు ఉండరు. రేపే గోదావరి తల్లిని ఉత్తరాంధ్రకు తీసుకెళ్తున్నాం.. ఉత్తరాంధ్ర చరిత్ర మార్చబోతున్నాం. కొండలు, గుట్టలు తొలుచుకుంటూ గోదావరి తల్లి తన దశను మార్చుకుని అనకాపల్లి వెళ్తుంది.వచ్చే ఏడాది విశాఖకు వెళ్తుంది.కృష్ణా, గోదావరి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని అన్నారు.
భవిష్యత్లో గోదావరి-కావేరి నదుల్ని అనుసంధానం చేసి దక్షణ భారతంలో నీటి సమస్య లేకుండా చేస్తాం.  ‘వెలిగొండ ప్రాజెక్టు’ను పూర్తిచేయడం ఎంతో ఆనందంగా ఉంది.వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి కృష్ణా జలాలను మార్కాపురం తీసుకొచ్చాం. భవిష్యత్తులో ‘గోదావరి-కావేరి’ నదుల అనుసంధానం జరగనుందని అయన అన్నారు.
====================